Wednesday, January 22, 2025

శ్రీవారి లడ్డు తూకంపై అపోహలు నమ్మవద్దు: టిటిడి

- Advertisement -
- Advertisement -

తిరుమల: భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తూకం (బరువు)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి లడ్డూ తూకం కచ్చితంగా 160 గ్రాములు ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి నాణ్యత, తూకంలో రాజీలేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని టిటిడి వెల్లడించింది.

ఆలయ నిబంధనల ప్రకారం లడ్డూ ప్రసాదం 160 నుంచి 180 గ్రాముల బరువు ఉంటుందని తెలిపింది. అయితే ఇటీవల ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలను తూకం వేయగా 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో సదరు భక్తుడు లడ్డూ కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడని టిటిడి పేర్కొంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండంతో వెంటనే అప్రమత్తం అయినట్లు టిటిడి అధికారులు తెలిపారు. తూనిన యంత్రంలో సాంకేతిక లోపం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లేమితో ఈ పొరపాటు జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News