Wednesday, January 22, 2025

వయోవృద్ధుల దర్శనం పై ఆ వార్తలను నమ్మకండి: టిటిడి

- Advertisement -
- Advertisement -

తిరుమల: వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని టిటిడి తెలిపింది. ఇవి పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోందని వెల్లడించింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టిటిడి అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరని కోరింది.

Don't believe those news on elderly people's darshan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News