Sunday, December 22, 2024

కర్నాటక కష్టాలు కొనితెచ్చుకోవద్దు

- Advertisement -
- Advertisement -

మళ్లీ అధికారంలోకి రాగానే ‘సంక్షేమ’ హామీలన్నీ అమలు

కాంగ్రెస్ హయాంలోని బాధలు.. ఈ పదేళ్ల అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి

కుల్కచర్లకే కృష్ణా జలాలు

పరిగి రోడ్ షోలో కెటిఆర్

మన తెలంగాణ/కుల్కచర్ల : 55 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలనను ప్రజలను మర్చిపోవద్దని కేవ లం పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వే యాలని గత పాలనకు, ఇప్పుడు పాలనను బేరీజు వేసుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం ఎన్ని కల ప్రచారంలో భాగంగా కుల్కచర్ల మండల కేం ద్రంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు చేసిందేమి లేదని, అన్ని మోసాలే చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మరోసారి కుట్ర చేసేందుకు పూనుకుందని, ప్రజలు ఎట్టి నమ్మకూడదన్నారు. సి ఎం కెసిఆర్‌ను ఓడించేందకు ఢిల్లీ నుంచి గల్లీ నా యకులంతా ప్రచారాలు చేస్తున్నారని, వారి మా య మాటలు నమ్మకూడదని తెలిపారు. ఆరు గ్యా రంటీలు, ఆరుగులు సిఎంలు అంటూ వారిలో వారే కొట్లాడుతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నయో అడిగి తెలుకొండని, కేవలం ఐదు గంటలలు మాత్రమే కరెంటు వస్తుందన్నారు.

గత కాంగ్రెస్ పాలనలో ఏ ఊరులో చూసినా కష్టాలే తాండవించేవని, మళ్లీ అవే కష్టాలు కొనితెచ్చుకోవద్దని కెటిఆర్ సూచిం చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు మంచి పేరు ఉం దని ఇక్కడ పథకాలను వారి రాష్ట్రాల్లో కూడా అమ లు చేస్తున్నారంటే పథకాలకు ఎలాంటి ఆదరణ ఉందో అర్థమతుందన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన తాండకు సేవాలల్ భవనాలు నిర్మిస్తామన్నారు. కుల్కచర్ల మండలానికి ప్రభుత్వం జూనియర్ కళాశాల మంజూరు చేస్తామన్నారు. కృష్ణనది జలాలు మొదటగా రాబోయేది కుల్కచర్ల మండలానికే అన్నారు.

పరిగి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చేస్తామన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ఎంఎల్‌ఎ దివంగత హరీశ్వర్‌రెడ్డి అధికార పార్టీ విడిచి కెసిఆర్‌తో ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్ల్లో అభివృద్ధి చేసిన మహేష్‌రెడ్డికి మరో అవకాశం ఇచ్చి భారీ మెజార్టీ ఇవ్వాలని, మరింత అభివృద్ధికి అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, మంత్రి పట్నం మహేదంర్‌రెడ్డి, నాయకులు కాసాని వీరేష్ బాబు, రాష్ట్ర యమువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, ఎంపిపి సత్యమ్మ జెడ్పిటిపి రాందాస్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు శేరిరాంరెడ్డి, చౌడపూర్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కెబి రాజు, నియోజకవర్గ కార్యకర్తలు, పాల్గొన్నారు.

KCR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News