Monday, January 6, 2025

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ తల్లి విగ్రహంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపు మార్చే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని కేటీఆర్‌ సూచించారు. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిష్కరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తలెంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కెటిఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొద్దన్నారు.

“దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్‌ రూపొందించారు. తెలంగాణ తల్లి రూపు మార్చే ఆలోచనను మానుకోవాలి. భరతమాత రూపాన్ని వాజ్‌పేయి మార్చలేదు కదా.. తెలంగాణ తల్లి రూపాన్ని.. తర్వాత వచ్చిన ఏ సీఎం మార్చలేదు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఉన్నచోటే తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. తెలంగాణ చరిత్రపై మరిన్ని పుస్తకాలు రావాల్సి ఉంది” అని కేటీఆర్‌ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News