Thursday, January 23, 2025

ఆరోగ్య సేవ కమర్షియల్ కావద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆరోగ్య సేవలను డబ్బుతో ముడిపెట్టరాదు, వీటిని వాణిజ్యం చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయా పిలుపు నిచ్చారు. ఆరోగ్య సంరక్షణ ప్రక్రియ వాణిజ్యపరం కాని రీతిలో ఉండే భవిష్యత్తును రూపొందించేందుకు భారతదేశం ఇప్పుడు ముందుకు వెళ్లుతోందని బుధవారం ఆయన ఇక్కడ తెలిపారు. హెచ్చుతగ్గులు లేని ఎక్కువకాలం మనగలిగే ప్రపంచ ఆరోగ్యసంరక్షణ వ్యవస్థ కోసం పాటుపడాల్సి ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఒన్ ఎర్త్ ఒన్ హెల్త్ అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023 సదస్సులో ఆరోగ్య మంత్రి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రస్తుత ప్రపంచంలో మనిషికి ఆరోగ్య పరిరక్షణ కీలక అంశం. ఆరోగ్య సేవలను అందుకునేందుకు ప్రపంచస్థాయిలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుంటోంది. ఈ క్రమంలో వైద్య చికిత్సల పర్యటనకు వచ్చిన వారికి సరైన ఫలితం , వారి ఖర్చుకు తగ్గట్లు ఉండే విలువ అవసరం అని, ఈ క్రమంలో భారతదేశం సరైన విధంగా చికిత్సల పర్యాటక కేంద్రం అవుతుందని, ఇందుకోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని మాండవీయ తెలిపారు.

ఈ దిశలో సంబంధిత భాగస్వామ్యపక్షాలు అన్ని కూడా కలిసిరావాలని కోరారు. ఇప్పటి ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ద్వారా ఆరోగ్య సేవల విస్తృతికి, విదేశీయులు కూడా మరింత ఎక్కువగా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేయడం జరుగుతుంది, ఆరోగ్య సేవలలో వ్యత్యాసాలు లేకుండా సమగ్రతతో కూడిన చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తారు. పది దేశాలకు చెందిన ఆరోగ్య మంత్రులు, అధికారులు , 70కి పైగా దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. సామర్థం శక్తి పెరుగుతున్న కొద్ది బాధ్యతలు కూడా ఇనుమడిస్తాయి. గ్లోబల్ సౌత్ ప్రతీకగా నిలిచిన భారతదేశం ఆరోగ్య పరిరక్షణ సేవల విషయంలో ప్రపంచం పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రత్యేకించి ఆరోగ్య సేవలు వాణిజ్యమయం కాకుండా చూసుకుంటామన్నారు. గత తొమ్మిదేళ్లుగా భారతదేశం ఆరోగ్య రక్షణ విభాగంలో మనస్సు మేధను కేంద్రీకరించి కృషి చేస్తోందని , సరైన సముద్ధేశంతో ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News