లండన్: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహనెకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బాసటగా నిలిచాడు. కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. రహనే తర్వాతి మ్యాచులో అతడు రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతితక్కువ కాలంలోనే శార్దూల్ ఠాకూర్ కీలక ఇన్నింగ్సులు ఆడాడని ప్రశంసించాడు. కాగా, నాలుగో టెస్టు ఐదోరోజు (సోమవారం) ఆటకు ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్ సిరీసులో అజింక్య రహనె రాణించలేక, పేస్ పిచ్‌లపై మెరుగ్గా ఆడతాడని భావించినా ఇబ్బంది పడుతున్నాడు.
బయటకి స్వింగ్ అయ్యే బంతులకే కాకుండా లోపలికి వచ్చిన వాటినీ ఆడలేకపోతున్నాడు. ఫామ్‌లేమితో పరుగులేమీ చేయకుండా ఔటవుతున్నాడు. అతడి బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాథోడ్ అంటున్నాడు. ‘సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒడుదొడుకులు సహజమే. కెరీర్లో అనేక దశలు ఎదురవుతాయి. కొన్నిసార్లు పరుగులేమీ చేయని దశ వస్తుంది. అలాంటప్పుడే జట్టు అండగా ఉండాలి. వీలైనంత మేరకు మద్దతు ఇవ్వాలి’ అని ఆయన తెలిపాడు. నయావాల్ చెటేశ్వర్ పుజారా విషయంలోనే ఇలాగే జరిగిందని గుర్తుకు చేశాడు.
Don’t Concern on Rahane’s Batting: Coach Vikram