ఈరోజుల్లో నోటి రుచికి తగ్గట్టు ఆహారాన్ని తయారు చేసుకుంటాం. అయితే రుచి కోసం ఆహారాన్ని అతిగా వండే అలవాటు సర్వసాధారణంగా ఉంటుంది. ఇది రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి హానికరం కూడా. ఒకసారి ఆహారాన్ని వండడం, మళ్ళీ దాని వేడి చేయడం ఒక సాధారణ ప్రక్రియ. కానీ, ఇవే అలవాట్లు ఆర్యోగని దెబ్బతీస్తాయి. ఇప్పుడు అతిగా వండకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం. అయితే, కొన్ని ఆహార పదార్థాలను అతిగా వండడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గుతాయి.
బచ్చలి కూర
ఆర్యోగనికి మంచి చేసే బచ్చలికూరలో ఇరాన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిని అతిగా ఉడికించడం వల్ల ఈ పోషకాలు తొలగిపోతాయి. దీని చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టి, ఆపై దానిని ఎక్కువగా ఉడికించి తింటారు. అయితే ఇలా తినడం వల్ల హానికరం. బచ్చలి కూరను తక్కువగా ఉడికించడం చాలా మంచిది.
బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. అయితే దీని అతిగా ఉడికించడం వల్ల పోషకాలు పూర్తిగా పోతాయి. ఎన్నో పోషకాలు అందించే బ్రోకలీ ని ఎక్కువగా ఉడికిస్తే తక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇది ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
చేపల
చేపల లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాల చాలా కలిగి ఉంటాయి. అయితే, చేపలను ఎక్కువగా ఉడికించడం వల్ల ఈ పోషకాలు తొలగిపోతాయి. అప్పుడు వీటిని తిన్న కూడా ఆర్యోగనికి పెద్దగా ప్రయోజనామ్ ఉండదు. కావున రుచికి తగ్గట్టు తక్కువ ఉడికేటట్టు వండుకోవలి.
గుడ్లు
గుడ్లు ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. గుడ్డు చాలా బలంగా ఉంటాయి. ఆలా అని దాని ఎక్కువగా ఉడికిస్తే అది మీకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుడ్డును అతిగా ఉడికించడం వల్ల పోషకాల పరిమాణాన్ని కోల్పోతుంది.
ఆహారాలను అతిగా ఉడికిస్తే కలిగే నష్టాలు
1. ఆహారంలో ఉండే పోషకాల తగ్గుతాయి.
2. ఆహార పదార్థాలు రుచిని కోల్పోతాయి.
3. ఆహారంలో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి.
4. జీర్ణ సమస్యలు లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.