Monday, December 23, 2024

జీవితాలను నాశనం చేసుకోవొద్దు

- Advertisement -
- Advertisement -

గద్వాల : మిషన్ పరివర్తన అనే అంశంపై జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మహిళా శిశు దివ్యాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ జోగులాంబ గద్వాల వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల నిషేధంపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమం సంబంధించిన పోస్టర్లను డిడబ్లూఓ ముషాహిదా బేగం, డీఎస్పీ రంగస్వామి, అబ్కారీ ఇన్‌స్పెక్టర్ గోపాల్ , డిఈఓ సిరాజుద్దీన్, సిడబ్లూసీ మెంబర్స్ జయభారతి, శైలజ తదితరులు విడుదల చేశారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ప్రాణంతక వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తుందని డ్రగ్స్ తీసుకోవడం పొగ తాగడం ఇంజక్ట్ చేయడం లేదా తినడం వల్ల మానసిక , శారీరక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్ గోపాల్, సిడబ్లూసీ మెంబర్స్ జయభారతి, శైలజ, డిసిపిఒ నర్సింహ, ఎస్‌ఐ రామస్వామి, ప్రిన్సిపల్ నాయుడు, ఐసిపిఎస్ సిబ్బంది, సఖి సిబ్బంది, భరోసా సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్స్ , చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News