Monday, December 23, 2024

అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదు

- Advertisement -
- Advertisement -

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పార్టీ తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వం తీసుకోకుండా వారి సాగు చేసుకునే విధంగా సహకారం అందించాలని గతంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ను తీసుకువచ్చి,దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు చాలా రాష్ట్రాలు రెగ్యులరైజ్ చేసి,పట్టాలు ఇస్తున్నా తెలంగాణలో మాత్రం అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయకపోవడంతో అన్యాయం జరుగుతుందన్నారు.

బడా బాబుల విలాసాల కోసం హైదరాబాద్,మానేరు నదిలపై కేబుల్ బ్రిడ్జిలు కడుతున్నారు కానీ, 70 శాతం ప్రజలు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వాగులపై కనీసం బ్రిడ్జిలు కట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. భారీ వర్షాలకు వాగులు దాటుతూ చనిపోయిన వారంతా బహుజన వర్గాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన మోరంచపల్లి, కొండాయి ప్రాంతాలకు ప్రభుత్వం వంద కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఇళ్ల స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్ కట్టించుకుని భూములు రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వం,అసైన్డ్ భూములను ఎందుకు పర్మినెంట్ చేయటం లేదను ప్రశ్నించారు. స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసే జీవో నెం 46 ను ప్రభుత్వం తక్షణమే సవరించాలని కోరారు.

లిక్కర్ స్కాం,టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు,ఎమ్మేల్యేల ఆక్రమణల కబ్జాలు,పంచాయితీ కార్మికుల సమ్మెపై సర్కార్ పెద్దలు మాట్లాడకపోవడం సరికాదన్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకుపట్టాలు ఇస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల దగ్గర ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి రైతులకు పంచుతామన్నారు. అసైన్డ్ భూముల హక్కులకోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ హెచ్‌ఎండిఏ పరిధిలోని అసైండ్ భూముల ఆక్రమణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తదనంతరం ఎన్నికల ప్రచారాలు లోగోను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.వెంకటేష్ చౌహాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్,రాష్ట్ర సెక్రెటరీ గుండెల ధర్మేంధర్,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాచమల్ల జయసింహ, భూ రక్షణ సమితి నాయకులు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News