Friday, December 20, 2024

సైబర్ క్రైమ్స్ ఉచ్చులో పడకండి – సిడిటిఐ డైరక్టర్

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: విద్యార్థులు సైబర్ క్రైమ్స్ ఉచ్చు లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్ డిటెక్టవ్ ట్రైనింగ్ ఇనిస్టిస్టూట్ డైరక్టర్ క్రాంతి కూమార్ అన్నారు. ఎల్బీనగర్ దీక్ష జూనియర్ విద్యార్థిని, విద్యార్థులు రామాంతపూర్‌లో సెంట్రల్ డిటెక్టవ్ ట్రైనింగ్ ఇనిస్టిస్టూట్ డైరక్టర్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ అధికారి వేణుగోపాల్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరక్టర్ క్రాంతి కూమార్ మాట్లాడుతూ విదార్థిని, విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ బారీన పడకుండా సూచించారు. స్మార్ట్‌ఫోన్లు వాడకంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీడిటిఐ వైస్ ప్రిన్సిపల్ జయకుమార్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్స్ ఉద్యోగాలకు నేటి యువత ముందుకు రావాలన్నారు. కళాశాల ప్రతినిధి క్రాంతికుమార్, ప్రిన్సిపల్ రాజు, శ్రీశంకర్, శ్రీసాయి, అశ్విన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News