Friday, December 20, 2024

19న ఎయిరిండియా విమానాల్లో వెళ్లవద్దు..

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : ఈ నెల 19వ తేదీన ఎవరూ కూడా ఎయిరిండియా విమానాలలో ప్రయాణించరాదని, ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పుత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ పేరిట శనివారం ఓ వీడియో విడుదల అయింది. ప్రత్యేకించి సిక్కులు ఆ రోజున ఎయిరిండియా విమానాలను తమ ప్రయాణాలకు ఎంచుకోరాదు. ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే వారి ప్రాణాలకు ముప్పు అని తెలిపారు. కాగా అదే రోజు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజిఐ) ఎయిర్‌పోర్టు పేరు మారుస్తామని,

దీనిని ఆ రోజు మూసివేయిస్తామని కూడా ఈ ఖలీస్థానీ వీడియోలో తెలిపారు. నవంబర్ 19వ తేదీనే ఇప్పటి క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉందనే విషయాన్ని కూడా పన్నూ ప్రస్తావించారు. ఇండియా క్రికెట్ టీం ఇప్పటికీ అజేయంగా ఉన్న దశలో ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న దశలో ఈ ఖలీస్థానీ ఉగ్రనేత బెదిరింపులు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News