Monday, December 23, 2024

సాయం అందించిన సర్కారును మరవద్దు

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : ప్రభుత్వం నుంచి సాయం పొందిన వారు సర్కారును మరువద్దని, ఆదుకునే ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 మందికి రూ. 12 లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం సహయ నిధి నుండి మండలానికి ఒక చెక్కు కూడా వచ్చేది కాదని నేడు వేలాది మందికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. చెక్కులు పొందిన వారు గ్రామాల్లోకి వెళ్లి చర్చించాలని ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు అందజేత : జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నర్సిములు కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ పొంది ఉండటం వల్ల పార్టీ నుంచి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 2 లక్షల పార్టీ ప్రమాద భీమా చెక్కును నర్సిములు భార్య చిట్టెమ్మకు అందజేశారు.
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే : మున్సిపాల్టీ పరిధిలోని పాత బజార్ గణేష్ నగర్‌లోని దుర్గామాత బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News