నిర్మల్: తెలంగాణ సిద్దాంతకర్తగా తొలితరం ఉద్యమకారుడిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ప్రొఫెసర్ జయ శంకర్ అని, ఆయన కృషిని తెలంగాణ ప్రజలు ఎప్పటికి మరవొద్దని ఎస్పి ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎస్పి క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయ శంకర్ 89వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
జయ శంకర్ 1969 తొలి తరం తెలంగాణ ఉద్యమంలో నాన్ ముల్కీ ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతుల, జీవన విధానం పై పూర్థి అవగాహణ ఉన్న జయ శంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత పై ఆయన పుస్తకాలు రాసి తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయ శంకర్ సార్ తన అస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఐలు రమేష్, రామకృష్ణ, రాం నిర్జన్, ఆర్‌ఎస్సైలు, క్యాంప్ సిబ్బంది ఉన్నారు.