Sunday, December 22, 2024

జనాభా నియంత్రణే శాపమా?

- Advertisement -
- Advertisement -

చట్టసభల్లో సీట్లకు, జనాభాకు ముడిపెట్టవద్దు
అదే జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా నియంత్రణ కారణంగా నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే తీరని నష్టం జరుగుతుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆ యన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జనా భా నియంత్రణతో సహా అనేక అంశా ల్లో దక్షిణాది రా ష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయన్నారు. అ లాంటి రాష్ట్రాల్లో చట్టసభల సీట్ల సం ఖ్యను జనాభాతో ముడిపెట్టడం తగదన్నారు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయని అన్నా రు. దక్షిణాది రాష్ట్రాల్లో 1951లో 26.2 శాతం జనాభా ఉంటే 2022 నాటికి 19.8 శాతానికి తగ్గిందన్నా రు. అదే ఉత్తరాదిలో 39.1 శాతం నుంచి 43.2 శాతానికి జనాభా చేరిందన్నారు.

అంటే దక్షిణాదిలో 6.4 శా తం జనాభా తగ్గగా, ఉత్తరాదిలో 4.1 శాతం జనాభా పెరిగిందని కెటిఆర్ ట్విట్టర్‌లో అంకెలతో సహ వివరించా రు. 2026 డీలిమిటేషన్ ప్రక్రియ భారత ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు అని నాయిని అనురాగ్ రెడ్డి అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై మంత్రి కెటిఆర్ స్పందించారు. ఇలా అయితే దక్షిణాది రాష్ట్రాలు తమ ఉనికిని కో ల్పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీరుగా నియోజకవర్గాల పునర్విభజన జరగొద్దని తా ను మనస్పూర్తిగా కోరుకుంటున్నాని వ్యాఖ్యానించారు. జనాభాను నియంత్రించడంలో దక్షిణాది సఫలీకృతం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యం లో సీట్ల జనాభాతో ముడి పెట్టకుండా పెంచాలన్నారు. అప్పుడే తెలంగాణ వంటి రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News