Sunday, April 13, 2025

కెసిఆర్ కు శాలరీ ఇవ్వొద్దు…

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ పై స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వేతనం నిలిపివేయాలని ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు పొందుతూ కేసీఆర్ శాసన సభకు రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రజల అభ్యున్నతి కోసం విధులను శ్రద్ధగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రజలమైన తమ పన్నులతో ప్రతిపక్ష నాయకుడితో సహా ఎన్నికైన ప్రజాప్రతినిధుల జీతభత్యాలు చెల్లింపులు చేస్తారని, కానీ కేసీఆర్ అసెబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు.

తద్వారా ప్రతిపక్ష నేతలుగా తన బాధ్యతలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రభుత్వ విధానాలకు జవాబుదారీతనం, నిర్మాణాత్మక విమర్శలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలకు కీలకం అన్నారు. కేసీఆర్ సభకు రాకుండా చర్చల్లో పాల్గొనకుండా తనకు అప్పగించిన ఈ ముఖ్యమైన పాత్రను విస్మరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. అందువల్ల కేసీఆర్ తన విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవరకు ఆయన జీతభత్యాల విషయంలో స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News