మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చర్చోపచర్చల అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తె లిపింది. ఈ రెండు కీలకమైన ప్రాజెక్టులను కృ ష్ణాబోర్డుకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట ప్ర యోజనాలు దెబ్బతింటాయని, తమ ప్రభు త్వం బోర్డు ముందు, కేంద్ర ప్రభుత్వం ముం దుంచి న సమస్యలన్నింటినీ పరిష్కరించిన త ర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకొంటామని, అ ప్పటి వ రకూ ప్రాజెక్టులను అప్పగించేది లేదని నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీకి సమర్పించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే అంశాలపై గత పదేళ్ళల్లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ చేశారు.
దీనిపై సభలో వాడీవేడిగా చర్చలు జరిగా యి. ఈ చర్చల్లో భాగంగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి టి.హరీష్‌రావు తీర్మానం లో పొందుపరిచిన “గత ప్రభుత్వం” అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అంతేగాక తీర్మానాన్ని ఆమోదిస్తూనే గత ప్రభుత్వ హయాంలో ఏపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిల పంపకాలు చేసినట్లుగా ఉన్న వాఖ్యాన్ని కూడా తొలగించాలని మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన సూచనను అధికార పక్షం పట్టించుకోలేదు. అంతేగాక కేంద్ర ప్ర భుత్వం కెఆర్‌ఎంబి పరిధిని ఖరారు చేసిన సమయంలో కూడా గత ప్రభుత్వం ఎలాం టి అభ్యంతరాలు తెలపలేదని తీర్మానంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న నాగార్జునసాగర్ డ్యాంపై గత నవంబర్ 29వ తేదీన ఏపీ ప్రభుత్వం పోలీసులను పంపించి డ్యాం కుడి భాగాన్ని తన నియంత్రణలోకి తీసుకొందని, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సిఆర్‌పిఎఫ్ బలగాలను పంపించి ఏపి పోలీసులను వెళ్ళగొట్టి డ్యాంను స్వాధీనంలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకాలకు తెలంగాణ ప్రభుత్వం అనేక షరతులు విధించింది. నీటి పంపకాలు జరిపేటప్పుడు పరివాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా), కరువు పీడిత ప్రాంతం, జనా భా, వ్యవసాయ ఆధారిత భూములను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కెడబ్లుడిటి-1 (జస్టీస్ బచావత్ ట్రిబ్యునల్ అవా ర్డు) ప్రకారం బేసిన్ అవసరాలు తీర్చేందుకు మొద టి ప్రాధాన్యతను ఇవ్వాలి. 1962లో ప్లానింగ్ కమీషన్ మంజూరీ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బచావత్ అవార్డు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో 830 అడుగుల మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ (ఎండిడిఎల్-కనీస నీటిమట్టం)ను పా టించాలని, అదే విధంగా నాగార్జునసాగర్‌కు 264 టిఎంసిల నీటిని తరలించాలనే బచావత్ అవార్డునే అమలులోకి తీసుకురావాలని ఆ తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేంద్ర జల సంఘం గతంలో ఆమోదించిన చెన్నై నగరానికి 15 టిఎంసిలు, ఎస్‌ఆర్‌బిసి కాల్వలకు 19 టిఎంసిల నీటిని (మొత్తం 34 టిఎంసిలు) మాత్రమే శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించుకునే నిబంధనలనే గట్టి గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగా క కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తి మంత్రిత్వశాఖ, కేంద్ర జల సంఘం (సిడబ్లుసి) అనుమతుల్లేకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణాలు ఉండకూడదని, ప్రాజెక్టుల పరిధిని పెంచే పనులు, కృష్ణానదీ జలాలను ఇతర బేసిన్‌లకు తరలించే కొత్త నిర్మాణాలేవీ చేయకూడదని, ఈ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా అమలుచేయాల్సి ఉందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాలకు శాసనసభ ఆమోదం తెలిపింది.