Wednesday, January 22, 2025

విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి 
బిఆర్‌ఎస్ హయాంలో పదేళ్లు ప్రజలపై భారం వేయలేదు
ట్రూ అప్ ఛార్జీల కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు ఆనాటి ప్రభుత్వమే భరించింది 
జిఒ 29పై న్యాయపోరాటం చేస్తాం: కెటిఆర్

ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు మా కు సమాచారం అందిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వాటిని విరమించుకోవాలని ఎలక్ట్రిసిటి రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్‌ని కలిసి కోరామని తెలిపారు. విద్యుత్ అనేది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి న అంశమని అన్నారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ ఛార్జీ వ సూలు చేస్తున్నారని, ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉ న్నదానికంటే 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.

కెసిఆర్ హయాంలో పదేళ్లలో ప్రజలపై భారం వేయకుండా ట్రూ అప్ చార్జీల కోసం నెలకు వెయ్యి కోట్లు ప్రభుత్వమే భరించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ను వ్యాపార వస్తువుగా చూస్తోంది, ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు అవుతుందన్నారు. ఇళ్లలో వాడుకునే కరెంట్‌కు సంబంధించి నెలకు రూ. 300 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీలు 10 రూపాయల నుంచి ఏకంగా రూ. 50 పెంచాలని ప్రతిపాదన చేశారని, ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క నిర్ణయం మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి నెడుతుందని వాపోయారు. సామాన్యుల గృహాలకు సంబంధించి బలంగా, భారీగా విద్యుత్ బిల్లుల భారం పడుతుందని తెలిపారు. పరిశ్రమలన్నింటినీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారని, ఇది చాలా అసంబద్ధమైన ప్రతిపాదన అని, ఇది పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ చేసే విధంగా చేయటమంటే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని చెప్పారు.

గ్రూప్ 1 విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో కేసు వేసింది తామేనని కెటిఆర్ తెలిపారు. హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టును ఆదేశించిందన్నారు. రిజర్వేషన్లకు ఎస్‌సి,ఎస్‌టి, బిసి, ఇడబ్లూఎస్ రిజర్వేషన్లకు అనుగుణంగా తాము జిఒ నంబర్ 55ను తీసుకొచ్చామని, ఓపెన్ కోటాలో కూడా మెరిట్ ప్రకారం అందరికీ అవకాశం కల్పించామని తెలిపారు.
ప్రభుత్వ మూర్ఖపు వైఖరితో గ్రూప్ 1 విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. జిఒ 29 ఎస్‌సి,ఎస్‌టి, బిసిల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా మారిందని విమర్శించారు. జిఒ 29పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, బిఆర్‌ఎస్ హయాంలో ఒక్క సంఘటన జరగలేదని గుర్తుచేశారు.

జర్నలిస్టులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించింది మేమే
తాను జర్నలిస్ట్ లను అవమానించానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బిఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, జర్నలిస్టులు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని, వారంటే బిఆర్‌ఎస్‌కు ఎంతో గౌరవముందని వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్‌లను తాను అవమానించానని అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News