Sunday, March 23, 2025

లోక్‌సభ సీట్లను మరో 25 ఏళ్లు పెంచకూడదు: రేవంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోవని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అధ్యక్షత జరిగిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. లోక్ సభ సీట్లు పెంచకుండా, రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని అన్నారు. డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ సీట్లను మరో 25 ఏళ్లు పెంచకూడదని డిమాండ్ చేశారు. ఓకవేళ డీలిమిటేషన్ జరిగితే.. యూపి, బీహార్, ఎంపి, రాజస్థాన్.. మిగితా రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయిస్తాయని.. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఒప్పుకునేది లేదని రేవంత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News