Monday, March 31, 2025

సొంత బౌలర్ల ఆత్మవిశ్వాసంతో ఆటలోద్దు: మైఖేల్ వాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా లక్నో జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. టోర్నీ ఆడిన తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో కాస్త తడబడ్డారు. లక్నో బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌లో 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ బౌలర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో లక్నో ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.. అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయవద్దని ఆయన ఎస్ఆర్‌హెచ్ జట్టు యాజమాన్యాన్ని కోరారు. ‘ఎప్పుడైనా మనం హైదరాబాద్ బ్యాటింగ్, పవర్ హిట్టింగ్ గురించి మాట్లాడుకుంటాం. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తారు. కానీ, మరోవైపు సొంత బౌలర్ల ఆత్మ విశ్వాసం దెబ్బ తినకుండా మేనేజ్‌మెంట్ జాగ్రత్త పడాలి. రోడ్డు వంటి పిచ్‌పై బౌలింగ్ చేయడం సులువు కాదు.. ప్రత్యర్థి బ్యాటర్లు వీరి బౌలింగ్‌లో భారీ స్కోర్ సాధించారు. కమ్మిన్స్ ఫర్వాలేదు అనిపించినా.. అంతకు ముందు మ్యాచ్‌లో 60 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ, జంపా కూడా భారీగా పరుగులు ఇచ్చారు. అందుకే బౌలింగ్ విషయంలో హైదరాబాద్ జాగ్రత్తగా ఉండాలి’ అని వాన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News