Monday, November 18, 2024

సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సినిమాలు, సినీ ప్రముఖులపై అనవసరంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ కమలంపార్టీ కార్యకర్తలకు సూచించారు. పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు సినిమాలను విమర్శించడం తగదని ప్రధాని హితవు పలికారు. న్యూఢిల్లీలో మంగళవారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మన శ్రమను కప్పిపుచ్చేవిధంగా బిజెపి నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఈ సమావేశానికి హాజరైన బిజెపి ఆఫీస్ బేరర్ ఒకరు ప్రధాని మోడీ సందేశాన్నిమీడియా వెల్లడించారు. వార్తల హెడ్‌లైన్స్‌లో నిలవాలనే లక్షంతో స్టేట్‌మెంట్లును ఇవ్వడం మానుకోవాలని ప్రధానమంత్రి కాషాయపార్టీ శ్రేణులకు తెలిపారన్నారు.

బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్, హీరోయిన్ దీపిక పదుకొణె నటించిన చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని పలువురు బిజెపి నేతలు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, భోపాల్ ఎంపిప్రగ్యా ఠాకూర్ కూడా చిత్రాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. పఠాన్ చిత్రంలోని బేషరమ్‌పాటలో దీపిక ధరించిన దుస్తులపై మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిదిద్దకపోతే చిత్రాన్ని అడ్డుకుంటామని చండీగఢ్ కేంద్రంగా ఉన్న ఓ సంస్థ కూడా పఠాన్ చిత్ర ప్రదర్శనను నిషేధించాలని కోరుతూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు. ఈక్రమంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి పఠాన్ చిత్రనిర్మాతలకు మార్పులు చేయాల్సిందిగా సూచించామని ప్రకటించారు. రివైజ్డ్ వెర్షన్‌ను సెనార్ బోర్డుకు దాఖలు చేయాలని తెలిపామన్నారు. కాగా గతేడాది సంస్థ ఒకటి నటించిన చడ్డా చిత్రంలో దేవతలను అపహాస్యం చేశారని ఆరోపిస్తూ నిషేధించాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సినిమాలను లక్షంగా చేసుకుని వివాదాలు తలెత్తేలా కామెంట్లు చేయవద్దనితెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News