Thursday, December 5, 2024

ఈ నెంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయా?

- Advertisement -
- Advertisement -

ఈరోజుల్లో దేశంలో ఆన్‌లైన్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును నిమిషాల్లోనే సైబర్ నేరాల వల్ల పోగొట్టుకునున్నారు. సామాన్య ప్రజలను బయటపెట్టి, మోసగించడానికి అనేక కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాంటి వాటిలోనే ఒకటి “డిజిటల్ అరెస్ట్”. దీని ద్వారా స్కామర్లు బాధితుడి నుండి భారీగా డబ్బును దోపిడీ చేస్తున్నారు. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు, పలు సూచనలు జారీ చేసింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

టెలికమ్యూనికేషన్స్ విభాగం అంటే DoT ఇతర దేశాల నంబర్ల నుండి వచ్చే ఫేక్ కాల్స్ గురించి హెచ్చరిక జారీ చేసింది. ఈ అంతర్జాతీయ నంబర్ కోడ్‌ల నుంచి అనేక నకిలీ కాల్‌లు వస్తున్నాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం చెబుతోంది. ఈ కాల్‌లను పికప్ చేయకూడదు అని సూచిస్తోంది.

అంతర్జాతీయ నంబర్ కోడ్‌లు చూస్తే

+77
+89
+85
+86
+84

ఈ నంబర్ల ద్వారా వచ్చే కాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని.. మోసం జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే, సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఈ కాల్‌ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. కాగా, ఇది విదేశీ నంబర్‌లను బ్లాక్ చేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News