Sunday, January 19, 2025

మేడిగడ్డతో రాజకీయం చేయొద్దు: పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని బిఆర్‌ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం బిఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కెసిఆర్ నిర్మించారని, తెలంగాణలో కరువును పారద్రోలేలా కాళేశ్వరం నిర్మించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు లేనిది ఉన్నట్టు చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో మూడు మాత్రమే కుంగిపోయాయని, లోపాలను సవరించాలి కానీ రాజకీయం చేయొద్దని చురకలంటించారు. రాజకీయం చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కారు టైర్ పంక్చర్ అయితే బయట పడేస్తామా? అని పోచారం ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News