న్యూఢిల్లీ: ఇప్పటివరకు కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు రాని కారణంగా 18-44 వయసు ఉన్న ప్రజలు మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ల వెలుపల బారులు తీరవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఢిలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో సుమారు 3 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రానున్నాయని, ఆ తర్వాత 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
మూడవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18-44 వయసు ఉన్న ప్రజలకు కరోనా టీకా వేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయితే, వ్యాక్సిన్ల కొరత కారణంగా తాము ఈ ప్రక్రియను చేపట్టలేక పోతున్నామని ఢిల్లీ, మరి కొన్ని రాష్ట్రాలు తమ నిస్సహాయతను వ్యక్తం చేశాయి. వచ్చే మూడు నెలల్లో 67 లక్షల డోసుల చొప్పున కోవిషీల్డ్, కోవాక్సిన్ కోరుతూ ఆర్డర్లు పెట్టామని కేజ్రీవాల్ తెలిపారు. ఆయా కంపెనీలు తమకు అవసరమైనంత వ్యాక్సిన్లను అందచేసిన పక్షంలో రానున్న మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడికీ వ్యాక్సినేషన్ జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
Don’t queue up at Covid 19 Vaccine Centers: Kejriwal