Thursday, January 23, 2025

సామాజిక మాధ్యమాల విమర్శలకు స్పందించవద్దు: మాజీ మంత్రి ఈటెల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడానికి సీనియర్ నాయకులు కారణం అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంపై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కొంతమంది అజ్ఞానులు పెట్టే పిచ్చి పోస్టులకు నా అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా 16 శాతం ఓట్లు, 8 సీట్లు గెలిచి, 19 సీట్లలో రెండవ స్థానంలో నిలిచామని దానిని స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ క్యాడర్‌ను బలహీనపరచడానికి, అనైక్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారు. అలాంటి వారి మాయలో పడ్డకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించడం కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News