Friday, November 22, 2024

స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దు…. హెలికాప్టర్‌లో తిరిగే ఐఎఎస్ ఆమె ఒక్కరే

- Advertisement -
- Advertisement -

స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దు
దేశంలో హెలికాప్టర్‌లో తిరిగే ఐఏఎస్ ఆమె ఒక్కరే
స్మిత సబర్వాల్‌పై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. గత ప్రభుత్వంలో సిఎంవో కార్యదర్శిగా పని చేసిన ఆమె తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారితో దూరంగా ఉంటున్నారు. కనీసం ముఖ్య మంత్రి అయిన రేవంత్‌ని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలవలేదని విమర్శలున్నాయి. ఆమె కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె గురించి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించడం చర్చనీయాంశం అయింది. ఐఎఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి, ఇక్కడి తప్పుల నుంచి తప్పించుకోవడం కొంత మంది ఐఎఎస్‌లకు ఫ్యాషన్ అయిపోయిందని ఆయన విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని విమర్శించారు. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఎఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ ఆకునూరి మురళి స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేశారు. “అప్పటి ప్రభుత్వం లో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం ఫ్యాషన్ అయ్యింది కొంత మంది ఐఎఎస్ ఆఫీసర్లకు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం. దేశం మొత్తంలో హెలికాఫ్టర్‌లో వెళ్లి పనులను ఇన్‌స్పెక్షన్ చేసే ఏకైక ఐఎఎస్ ఆఫీసర్ ఈమె మాత్రమే” అని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News