Monday, April 7, 2025

‘నా భర్త వల్లే ఇవన్నీ’.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే కల్పన ఈ పని చేయడానికి ఆమె భర్తే కారణం అంటూ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని ఆమె ఆపేయాలని కోరారు. ఇందుకోసం ఆమె స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు.

తను భర్త, కూతురితో సంతోషంగా ఉన్నానని, 45 ఏళ్ల వయస్సులో పిహెచ్‌డి, ఎల్‌ఎల్‌బి చేస్తున్నానంటే.. దానికి కారణం తన భర్తే అని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు. తమ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుందని తెలిపారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగానే నిద్రపట్టక చికిత్స తీసుకుంటున్నానని కల్పన స్పష్టం చేశారు. వైద్యులు సూచించిన ట్యాబ్లెట్స్‌నే అధిక మొత్తంలో తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను అని.. తన భర్త, కాలనీవాసులు, పోలీసుల సహాయం వల్లే ఇలా మీ ముందు ఉన్నానని ఆమె అన్నారు. తన భర్త సహకారం వల్లే అన్ని రంగాల్లో రాణిస్తున్నానని.. ఆయన తనకు జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్ అని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News