Sunday, December 22, 2024

బంగ్లాను తేలిగ్గా తీసుకోం

- Advertisement -
- Advertisement -

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

చెన్నై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ తమకు చా లా కీలకమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోమని స్పష్టం చేశాడు. సిరీస్‌లో విజయం సాధించడమే తమ ముందున్న ఏకైక లక్షమన్నాడు. దీని కోసం సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యామన్నాడు. బంగ్లాదేశ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఇ టీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో బంగ్లా టీమ్ చారిత్రక విజ యం సాధించిన విషయాన్ని తాము మరచిపోలేమన్నాడు.

ఇలాంటి స్థితిలో బంగ్లాదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత తాము ఆ డుతున్న టెస్టు సిరీస్ ఇదే కావడంతో కొన్ని ప్రతికూల పరిస్థితు లు ఎదురైనా ఆశ్చర్యం లేదన్నాడు. తాము మాత్రం సిరీస్‌లో గె లుపే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం కష్టమేమీ కాదన్నాడు. అయితే బంగ్లా వంటి ప్రమాదకర జట్టుతో పోటీ ఎప్పు డూ క్లిష్టంగానే ఉంటుందన్నాడు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ మాట్లాడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News