Monday, December 23, 2024

రాజ్‌భవన్‌ను నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు

- Advertisement -
- Advertisement -
Don't try to control Raj Bhavan
కేరళ గవర్నర్ మండిపాటు

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం శనివారం కొత్త మలుపు తిరిగింది. రాజ్‌భవన్‌ను నియంత్రించే అధికారం ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం పనిచేసేలా చూసే బాధ్యత తన పైన ఉందని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ శనివారం లెఫ్ట్‌ఫ్రంట్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి పెన్షన్ ప్రయోజనాలు అందిస్తూ కొద్ది నెలల క్రితం తీసుకున్న విధాన నిర్ణయం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని, ఇది కేరళ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని గవర్నర్ విమర్శించారు. ఈ విషయం తన దృష్టికి రాగానే ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరానని ఆయన చెప్పారు.

ఈ విధాన నిర్ణయానికి తాను సమ్మతించేది లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే రాజ్యాంగ బాధ్యత తన పైన ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు తాను ఇక్కడ లేనని, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం సజావుగా నడిచేలా చూసే బాధ్యత తనపైన ఉందని ఆయన అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు తన వ్యక్తిగత సిబ్బందిగా 11 మందిని మాత్రమే నియమించుకునే అధికారం తనకు ఉండేదని, కాని ఇప్పుడు కేరళలో ప్రతి మంత్రికి 20 మందికి పైగా వ్యక్తిగత సిబ్బంది ఉన్నారని, దీని వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోందని ఆయన అన్నారు. రెండేళ్లకే పెన్షన్ పొందే సిబ్బంది దేశంలో ఎక్కడా లేరని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల వ్యక్తిగత సిబ్బంది పేరిట పార్టీ కారకర్తలను నియమించుకుంటున్నారని, వీరికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం సొమ్మును ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News