Sunday, November 17, 2024

గోల్డ్‌స్మగ్లింగ్ కేసు… భయపెట్టడానికి ప్రయత్నించొద్దు : కేరళ సిఎం

- Advertisement -
- Advertisement -

Don't try to intimidate Says Kerala CM Vijayan

 

తిరువనంతపురం : కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సీఎం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేరళ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలు తనను కానీ తమ ప్రభుత్వాన్ని గానీ ఏ విధంగా ప్రభావితం చేయలేవన్నారు. ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఆరోపణలు చేసినా ప్రజలు వాటన్నిటినీ తిరస్కరించి 99 సీట్లతో గెలిపించి రెండోసారి తమకు అపూర్వవిజయం అందించారన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసి భయపెట్టేందుకు ప్రయత్నించ వద్దన్నారు. ఇలాంటి జిమ్మిక్కులు , ప్రయత్నాలేవీ ఫలించబోవన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుల వాంగ్మూలాలకు సంబంధించిన వార్తలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల ద్వారా ఎల్డీఎఫ్ ప్రభుత్వ ప్రతిష్ఠనను మంట కలపొచ్చని మీడియా భావిస్తోందా ? అని ప్రశ్నించారు. అలాంటి రిపోర్టులు మీ విశ్వసనీయతకు సరిపోతాయో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. మీడియాను సరిదిద్దేందుకు ఎవరూ రారని, ప్రజలే అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News