Monday, December 23, 2024

నాకు ద్రోహం చేసిన వారు.. నా ఫొటో పెట్టుకోవద్దు : శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై : తనకు నమ్మకద్రోహం చేసిన వాళ్లు తన ఫోటో వినియోగించవద్దని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ను ఉద్దేశించి ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ శివసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎన్సీపీ నేత అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల తరువాత శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు.

“ పార్టీకి జాతీయ అధ్యక్షుడినైన నేను, రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాత్రమే నా ఫొటో ఉపయోగించుకోవచ్చు. తన ఫోటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనకు ఉంది. నా భావజాలాన్ని వ్యతిరేకించేవారు, నాతో సిద్ధాంతపరంగా విభేదించే వారు నా ఫోటోను వాడవద్దు ” అని శరద్ పవార్ పేర్కొన్నారు. అనూహ్య పరిణామాలతో ఎన్సీపీ పార్టీ రెండుగా చీలిపోయినట్టయింది. అనంతరం తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఇరు వర్గాలు ప్రకటించుకున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జయంత్ పాటిల్‌ను తొలగిస్తున్నట్టు అజిత్ వర్గం పేర్కొనగా, అజిత్‌తోపాటు ఆయనతో వెళ్లిన ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు జయంత్ పాటిల్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News