- Advertisement -
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మూడు రంగుల జెండాల తయారీకి ప్లాస్టిక్‌ను వినియోగించొద్దంటూ రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ప్లాస్టిక్‌ను వినియోగించడం ప్రజల మనోభావాలకు, జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే చర్యేనని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నది. వేడుకల అనంతరం జెండాలను నేలపై వేయడం కూడా 2002 ఫ్లాగ్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని గుర్తు చేసింది. జాతీయ జెండా విషయంలో పాటించాల్సిన నిబంధనలపై అన్ని రకాల సంస్థలకూ అవగాహన కలిగించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
- Advertisement -