Wednesday, January 22, 2025

బైనాక్యులర్ గుర్తు వద్దు : షర్మిల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ వైఎస్‌ఆర్‌టిపికి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి ఆ పార్టీ ఆశ్రయించింది. తమ పార్టీకి మరో గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ అధినేత్రి షర్మిల కోరింది. గతంలో వైఎస్సార్టీపీ పార్టీ నాగలి గుర్తు కోసం దరఖాస్తు చేసుకుంది. ఇక, ఇప్పటికే వైఎస్సార్టీపీ పార్టీ చీఫ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బైనాక్యులర్ గుర్తుకు బదులు మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ అధినేత్రి షర్మిల కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News