Thursday, January 23, 2025

శాలువాలు,బొకేలు వద్దు.. వాటికి అయ్యే ఖర్చును సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

కార్యకర్తలకు, నాయకులకు సూచించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: నూతన సంవత్సర సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువాలు, బొకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటికి అయ్యే ఖర్చును సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని మంత్రి కార్యకర్తలకు, నాయకులను కోరారు. దీని వలన నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడమే సంతోషం అన్నారు. ఎలాంటి గిఫ్ట్లు తదితర హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు.

ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే జనుల ఇంటి ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు. డబ్బులు వృథా చేయకుండా సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే అది నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందని ఆయన కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని  ఆకాంక్షించారు. ఆదివారం తనను కలవడానికి వచ్చిన ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో సదరు అర్జీదారులు, సాధారణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News