Tuesday, November 5, 2024

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్ట్ 2 వరకు శానిటేషన్ డ్రైవ్ చేపడుతామన్నారు.  రాష్ట్రంలో అధికారులు ఇంటింటికి వెళ్లాలని, ఇళ్లకు వచ్చినప్పుడు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. అధికారులు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ  పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  ఇళ్ల వద్ద నీరు నిల్వకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News