- Advertisement -
వాషింగ్టన్ : అణుయుద్ధం గురించి భయపడవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ప్రజలను కోరారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా తన అణ్వాయుధ దళాలను అత్యంత గరిష్ఠ స్థాయిలో సన్నద్ధం చేస్తున్న తరుణంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ విలేకర్ల సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రస్తుతం అమెరికా తన అణ్వాయుధ అప్రమత్తత స్థాయిన మార్చవలసిన అవసరం లేదని చెప్పారు. అనేక అంశాలపై రష్యాతో అమెరికాకు ఏకాభిప్రాయం కుదరని సందర్బాలు గతంలో చాలా ఉన్నాయన్నారు. అయితే అణ్వాయుధాల వినియోగం వల్ల విధ్వంసకర పరిణామాలు సంభవిస్తాయని ఇరు దేశాలు
- Advertisement -