Saturday, December 21, 2024

ఆందోళన వద్దు… వెంటనే విధుల్లో చేరండి

- Advertisement -
- Advertisement -

ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లకు పౌరసరఫరాల కమిషనర్ సూచన
ఆయిల్ కంపెనీల అధికారులతో సమావేశమైన కమిషనర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆయిల్ టాంకర్ల డ్రైవర్ల సమ్మెపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్ లో బిపిసిఎల్, ఐఒసిఎల్, హెచ్ పిసిఎల్ ఆయిల్ కంపెనీల అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ డిఎస్ చౌహాన్ అయిల్ కంపెనీల అధికారులను ఆదేశించారు. సమ్మె చేస్తున్న డ్రైవర్ల సమస్యలపై సానుభూతితో చర్చలు జరపాలన్నారు, ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు ఇద్దరికీ తాము పూర్తి సహకారం అందిస్తామని, తక్షణమే విధుల్లో చేరి పెట్రోల్, డీజిల్ రవాణా చేయాలని సూచించారు.

డ్రైవర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిషనర్ డిఎస్ చౌహాన్ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు సాయంత్రానికల్లా ఆపరేషన్ అమల్లోకి రావడంతో కార్యకలాపాలు పునప్రారంభం అయ్యేలా చ ర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, భయాందోళనలకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యతేంద్రపాల్ సింగ్ డిజిఎం, రిటైల్ అండ్ స్టేట్ లెవల్ కోఆర్డినేటర్, తెలంగాణ (హెచ్ పిసిఎల్), వి. రవింద్ర కుమార్, డిజిఎం, ఎస్‌ఎల్ సి, (హెచ్ పిసిఎల్), టి. శ్రీనివాస్ రావు, సీనియర్ మేనేజర్, ఎస్‌ఎల్ సి, (హెచ్ పిసిఎల్), సితేష్ కిషన్, జిఎం, ఎల్ పిజి సేల్స్, హైదరాబాద్ ఎల్ పిజి డివిజన్, (ఐఓసిఎల్), సుదీప్ మిత్ర, డిజిఎం, రిటైల్ అండ్ స్టేట్ హెడ్ (ఐఓసిఎల్), పార్థివ్ ధార్, డిజిఎం, ఎల్ పిజి ఆపరేషన్స్ స్టేట్ ఆఫీసర్ (ఐఓసిఎల్), ఇతర పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News