Wednesday, January 22, 2025

లిఫ్టు గేట్ తెరుచుకుందని లోపలకు వెళితే…

- Advertisement -
- Advertisement -

రాంచి: లిఫ్టు డోర్ తెరుకోవడంతో అందులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి లిఫ్టు రాకపోవడంతో నాలుగు అంతస్తుల పైనుంచి పడిపోయి అక్కడికక్కడే మరనించాడు.జార్ఖండ్ రాజధాని రాంచిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని శైలేష్ కుమార్‌గా గుర్తించారు.

ఒక అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ అంతస్తులో నివసించే శైలేష్ కుమార్ శుక్రవారం గ్రౌండ్‌ఫ్లోర్ వెళ్లేందుకు లిఫ్టు బటన్ నొక్కాడు. డోర్ ఓపెన్ కావడంతో లిఫ్టులోకి ప్రవేశించేందుకు ఆయన అడుగు ముందుకేశారు. అయితే లోపల లిఫ్టు లేకపోవడం, తాను గాలిలో కాలు పెట్టానని తెలుసుకునే లోపలే ఆయన నాలుగు అంతస్తుల పైనుంచి బేస్‌మెంట్‌లో పడిపోయారు. పెద్దగా అరుపులు వినిపించడంతో తాను వెళ్లి చూడగా రక్తపు మడుగులో శైలేష్ కనిపించాడని, అప్పటికే ఆయన మరణించాడని భవనం సెక్యూరిటీ గార్డు ప్రవీణ్ కుమార్ చెప్పాడు. వెంటనే లిఫ్టు సీలు వేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాంచి ఎస్‌పి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News