Sunday, January 19, 2025

ఇంటింటికీ బిఆర్‌ఎస్ అండ

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో సిఎం సహాయ నిధితో ప్రతి ఇంటిలో అందరికి ఆరోగ్యం అందుతోందని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల నేతృత్వంలో ఇంటింటికీ బిఆర్‌ఎస్ అండగా నిలుస్తోందని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ దిడ్డి మాధవీరాజు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 37వ వార్డుకు చెందిన కొక్కుల సుమవర్ధినికి రూ. 50,000 లు, దూస సరోజనకు రూ.24,000లు సిఎం సహయనిధి నుండి మంజూరు కాగా శుక్రవారం బిఆర్‌ఎస్ వార్డు ప్రధాన కార్యదర్శి కూరపాటి భూమేష్‌తో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ దిడ్డి మాధవీరాజుఅందించారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి బిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు అందు తున్నాయన్నారు. పుట్టిన పాప మొదలు కొని వయో వృద్ధుల వరకు సిఎం కెసిఆర్ మార్గ దర్శనంలో అందరికి పథకాల లబ్ధి చేకూరుతోందన్నారు.మళ్లీ మరో సారి సిఎంగా కెసిఆర్ రావాలని మనసారా అకాంక్షిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News