Monday, December 23, 2024

బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : మహాజన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆధ్వర్యంలో నగరంలోని 21వ డివిజన్ ఎల్లమ్మగుట్టలో ఆపార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిందని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ గానీ, అవాస్ యోజన పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి ఇచ్చే నిధులు గానీ, రేషన్ కార్డులు ఉన్న వారికి ఉచిత రేషన్ బియ్యం, ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం, అయ్ముషన్ భారత్‌ను కరోనా సమయంలో ప్రవేశపెట్టి ఉచిత వ్యాక్సిన్‌ను ఇవ్వడం జరిగిందన్నారు.

ఇక రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలకు ప్రశ్నించాలని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని ఇవ్వడం లేదని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా దళితబంధు పథకం కింద అర్హులైన దళితులకు అందడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, నాయకులు నవీన్, ముత్తయ్య, ఎండల సాగర్, లింగం, ఓం ప్రకాష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News