Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా రాఖీలు డోర్ టు డోర్ డెలివరీ

- Advertisement -
- Advertisement -

Door to Door Delivery of Rakhis by TSRTC Cargo and Parcel Services

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా టిఎస్ ఆర్టీసి మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని ఆడపడుచులు టిఎస్‌ఆర్టీసి కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరల్లో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. టిఎస్ ఆర్టీసి కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని జంటనగరాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం కల్పించినట్టు పేర్కొంది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి.జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్టీసి కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నెంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News