Monday, December 23, 2024

ఇంటింటికి వెల్లి సిఎంఅర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎంపిపి పిల్లి రేణుక కిషన్ తెలిపారు. మండల కేంద్రంలో సొమవారం జడ్పీటిసి చీటి లక్ష్మన్‌రావు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డితో కలసి ఇంటింటికి వెల్లి 12 మంది లబ్దిదారులకు మంజూరైన సిఎంఅర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పోరేట్ ఆస్పత్రుల చుట్టు తిరిగి వైద్యం చేయించుకొని చేతిలో చిల్లి గవ్వ లేని సమయంలో సిఎంఅర్‌ఎఫ్ సహయం ఊరట కలిగిస్తుందని తెలిపారు. బాధితులను పరమార్శించి వారి ఆరోగ్య పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఆస్తులున్న ఆరోగ్యానికి మించిన ధైవం లేదన్నారు. ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు.

రక్త నమూనాలు తీసుకొని 57 రకాల ఉచిత పరీక్షలు చేసి రోగ నిర్దారణ చేస్తారని వివరించారు. దైనందిన జీవితంలో డాక్టర్ల సలహలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఐటి పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ప్రత్యేకచోరవతో 30 పడకల ఆస్పత్రి మంజూరైనట్లు తెలిపారు. అనతి కాలంలో ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందబోతున్నాయని అకాంక్షించారు.

పేదలు ఆర్థికంగా ఎదుగాలనే సదుద్ధేశంతో దేశంలో ఎక్కడ లేనివిధంగా ముఖ్య మంత్రి కెసిఅర్ స్వరాష్ట్రంలో మనమంతా గర్వపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జిల్లాకో మెడికల్ కళాశాల , పెద్దా ఆస్పత్రులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కెసిఅర్ అన్నారు. ప్రతి పక్షాల విమర్శలు తిప్పి కొట్టాలని కోరారు.

ప్రజలంతామనోధైర్యం కల్పించి వెంట నడువాలని కోరారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ క్రిష్ణహరి , ప్యాక్స్ చేర్మేన్ గుండారపు క్రిష్ణరెడ్డి , ఎంపిటిసిలు ఎనుగందుల అనసూయ నర్సింహులు , పందిర్ల నాగరాణి పరుశరాములుగౌడ్ , వేణుగోపాల స్వామి ఆలయ చేర్మేన్ నంది కిషన్ ,బిఅర్‌ఎస్ పట్టణ శాఖ అద్యక్షులు బండారి బాల్ రెడ్డి , నాయకులు గుల్లపల్లి నర్సింహరెడ్డి , అందె సుబాస్ , కొండ రమేశ్ గౌడ్ , గంట బాలా గౌడ్ తదితరలు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News