Friday, December 20, 2024

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తాగేందుకు శుద్దజలం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం మంచినీళ్ల పండుగను పురస్కారించుకొని జిల్లాలోని మాణిక్‌గూడ, అడప్రాజెక్టు వద్ద 115 ఎంఎల్‌డి నేటి శుద్దికరణ కేంద్రం అవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌భాజ్‌పా య్, జిల్లా జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రామన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటికి శుద్దజలం అందించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాలలో సైతం ట్యాంకులు నిర్మించి పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రతి ఆదివాసి గ్రామానికి తాగునీటిని అందించడం జరుగుతుందని, ప్లోరైడ్ బాధిత గ్రామాలకు సైతం సిద్ధ్దమైన తాగునీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 15 మండలాలకు తాగునీరు అందించడం జరుగుతుందని, ప్లారైడ్ బాధిత గ్రామాలకు సైతం సిద్దమైన త్రాగునీరు అందించి ప్రజల అరోగ్యాన్ని కాపాడ డం జరుగుతుందని తెలిపారు.

మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 15 మండలాలకు తాగునీరు అందించడం జరుగు తుందని, బోర్లు పడని గ్రామాలకు పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, జోడేఘాట్ ప్రాంతానికి నీరు అందించడంలో అధికారుల కృషి అభినందనీయమని తెలిపారు. నీళ్లు రాని గ్రామాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తెలంగాణ చరిత్ర, మిషన్ భగీరథ కార్యక్రమంపై చేసిన ప్రదర్శనను అందరిని అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, జడ్పిటిసిలు అరిగెల నాగేశ్వర్‌రా వు, అజయ్‌కుమార్, ఎంపిపిలు మల్లికార్జున్, జుమ్మిడి సౌందర్య, పెందూర్ మోతిరాం, ముండే విమలబాయి, మిషన్ భగీరథ ఎస్‌ఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News