Monday, December 23, 2024

మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి : మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి శాశ్వత పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కల్కి సరోవర్ కాలనీలో మంజీర మంచినీటి పైప్‌లైన్ పనులు పూర్తయిన సందర్భంగా మంజీర కుళాయిని ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కళల ప్రాజెక్ట్ ఐన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడం జరుగుతుందని అన్నారు. కాలనీ వాసుల కోరిక మేరకు పాత పైప్‌లైన్ స్థానంలో కొత్త పైప్‌లైన్ వేయడం జరిగిందని, దానితో ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్య నుంచి విముక్తి లభించిందని, ఇక నుంచి కాలనీ వాసులకు సురక్షిత మంచినీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అనతరం మంజీరా నీటి పైప్‌లైన్ వేసి నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే గాంధీకి కాలనీ వాసులు ఈ సందర్భంగా కృతజ్ఙాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా,శ్రీకల్కి సరోవర్ కాలనీ వాసులు రమచంద్రంచ పిఎస్ రావు, నర్సింహ, శ్రీధర్, అన్సారీ, రమాదేవి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News