Monday, December 23, 2024

మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట: అపర భగీరథుడు సిఎం కెసిఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం ఎన్నో ఏళ్ల నుంచి నీటి కష్టాలను తీర్చిందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట మున్సిపాల్టీ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి సామూహిక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరమైన తాగునీటి ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చేవారని ఆయన చెప్పారు.

సిఎం కెసిఆర్ పాలనలో మిషన్ భగీరథ నళ్లాలతో ఇంటింటికి తాగు నీరు సరఫరా అవుతుందన్నారు. మున్సిపాల్టీలో వాటర్ సప్లైర్‌గా పనిచేస్తున్న సంగప్పతో పాటు సిబ్బందిని కౌన్సిలర్‌లు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింత గోపాల్, కమీషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్‌లు మహేశ్వరీ, విద్యాసాగర్‌రెడ్డి, సాతానీ శ్రీశైలం,మోబీన్, వీరేశం తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News