Monday, January 20, 2025

డెంగ్యూపై యుద్ధం

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి పరిధిలో డోర్ టు డోర్ జ్వర సర్వే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 10వేల బ్లడ్
యూనిట్ల సేకరణ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్ సపరేటర్ అవసరమైన వారికి ఉచితంగా రక్తం నివారణ చర్యలపై
వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ మంత్రులు హరీశ్, కెటిఆర్ సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అ ప్రమత్తమైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తం గా డెంగ్యూ నివారణకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో డెంగ్యూపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. జిహెచ్‌ఎంసి సహా అన్ని మున్సిపాలిటీల్లో జర్వ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బూస్టర్ డోస్ విరివి గా వేసే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డెంగ్యూ నివారణ చర్యలపై సోమవా రం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భం గా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూప్రతి ఐదేళ్లకు ఒకసారి పెరుగుతాయని తెలిపారు. ఇది ఐదో ఏడాది కాబట్టి.. కేసుల తీవ్రతను గమనిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గ్రేటర్ పరిధిలో జులై నెలలో 542 డెంగీ కేసులు నమోదైతే.. ఆగస్టులో ఆ సంఖ్య 1,827కి చేరిందని తెలిపారు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాలన్నారు. తొట్టిలు, కొబ్బరిచిప్పలు, పాత టైర్లను దూరంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 1,600 మంది ఎంటమాలజిస్టులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని,ప్లేట్‌టెట్ సపరేటర్ మిషన్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఎంత రక్తాన్నైనా ఉచితంగా ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, మందులు, పరికరాలు సిద్ధంగా ఉంచామని అన్నారు. దోమల నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా బాగా ప్రచారం చేయాలని అన్నారు.సెప్టెంబర్ 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో జ్వర సర్వే

డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని హరీశ్‌రావు సూచించారు. టీ డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తామని అన్నారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని… జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బాధితులు బస్తీ దవాఖానాకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతన్ననెలన్నరగా టీ డయాగ్నసిస్ ద్వారా 27వేల టెస్టులు చేయడం వల్ల కేసులు పెరిగినట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. బస్తీ దవాఖానాల వల్ల ఫీవర్ ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రికి కేసులు తగ్గాయని అన్నారు. ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌లో బ్లడ్ సపరేటర్స్ ఉన్నాయని, బ్లడ్ విషయంలో ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ జ్వర సర్వేతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసేందుకు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది కలిసి పనిచేయాలని చెప్పారు.

ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి : మంత్రి కెటిఆర్

గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం బాగా చేశాం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, జోనల్ ,డిప్యూటీ కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్నాయో.. పరిశీలించి, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోను ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమం కోసం చిన్న పిల్లలను, మహిళలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మాను వినియోగించాలని అన్నారు. విద్యార్థులు, ప్రిన్స్‌పాళ్లు, టీచర్లు అందరూ పాల్గొని సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్స్ అంటించాలని చెప్పారు. డెంగ్యూ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచి నీటిలో ఉంటాయని, వర్షం లేదా ట్యాప్లలో నుండి వచ్చే నీటిలోను పెరుగుతాయని అన్నారు.

కాబట్టి నీరు నిలువ లేకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపల్ శాఖ, మెప్మా, విద్యార్థులు, పిల్లలను, ప్రజా ప్రతినిధులను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమాలను స్థానికంగా బాగా ప్రచారం చేయాలని చెప్పారు. ఎంటమాలజీ టీం బాగా పని చేస్తుందని, యాంటీ లార్వా ఆపరేషన్లు బాగా చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలని అన్నారు. రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడదామని, సెప్టెంబర్ 17న విరివిగా క్యాంపులు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారులు కూడా తమ గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని, కలెక్టర్లు జిల్లాలో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుందని తెలిపారు.

పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహిద్దామని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎటమాలజీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రం దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోని , డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే పకడ్బంధీగా ఉద్యమంలా నిర్వహించాలని చెప్పారు. ఈ జూమ్ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వి, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్, డీహెచ్ హెల్త్ శ్రీనివాస రావు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News