Friday, November 15, 2024

గ్రేటర్‌లో ఇంటింటి జర్వ పరీక్ష షురూ

- Advertisement -
- Advertisement -

Door to door fever survey started in Hyderabad

మన తెలంగాణ/ హైదరాబాద్ : డెంగ్యూ వ్యాధి కట్టడే లక్షంగా గ్రేటర్‌లో ఇంటింటి జ్వర పరీక్ష ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావుల ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి పరిధిలో ఎన్‌బిటి నగర్ వార్డులో మంగళవారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటింటి జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్‌బిటి నగర్‌లో డెంగ్యూ తీవ్రత అధికంగా ఉండడంతో మేయర్ ఇంటింటికి తిరిగి డెంగ్యూ వ్యాధి కి నివారణకు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రాణాంతాక డెంగ్యూ లాంటి విష జర్వాల కట్టడికి ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనినగరవాసులను కోరారు. ఇంటి లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కుటుంబ సభ్యులందరూ కలిసి పరిసరాలను పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. జిహెచ్‌ఎంసి పరిధిలోఎంటమాలొజి విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 4846 కాలనీలకు ఒక్కొక్కరికి రెండు మూడు కాలనీలకు బాధ్యుతలను అప్పగించామని తెలిపారు.వీరు దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల పైన ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు, ఫాగింగ్,నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు ఉత్పత్తి కాకుండా మందును పిచికారి చర్యలు తీసుకుంటున్నారని మేయర్ వివరించారు. దోమల వలన వచ్చే అనర్ధాలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా నివారణ చర్యలు కూడా తీసుకుంటారని అన్నారు. ఆశా వర్కర్ల ద్వారా జ్వరం వచ్చిన వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరిస్తారని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మేయర్ అన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఎంటమాలజీ,పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిడ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా శానిటేషన్ కోసం వీల్ డస్ట్ బీన్‌లను పారిశుధ్య కార్మికులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, చీఫ్ ఎంటమాలజి రాంబాబు, డిసి రజనీ కాంత్ రెడ్డి లతో సీనియర్ ఎంటమాలజీ రజనీ, రజిత వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News