Wednesday, January 22, 2025

అధికారుల నిర్లక్ష్యంతో నీరుకారుతున్న ఇంటింటికి ఇంటర్‌నెట్ పథకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదబాద్: అధికారుల నిర్లక్షంగా కారణంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి ఇంటర్‌నెట్ పథకం నీరుకారుతోంది. టి ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ, 3600 కోట్లతో చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ , వేగవంతమైన బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కల్పించే పనులు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి చందంగా సాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానంతో పాటు సుమారు కోటి కుటుంబాలకు తక్కువ ధరేక బ్రాండ్ బ్యాండ్ సేవలు అందిచేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టులోను రాష్ట్ర ఐటీశాఖ ప్రారంభించి సంవత్సరాలు దాటుతున్నా వాటికి సంబంధించిన నెట్ ఫలాలు సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అందడం లేదు.

Also Read: పేకమేడలా కూలిన గంగా వంతెన

5 సంవత్సరాల క్రితం పైలెట్ ప్రాజెక్టుగా మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాలు కేబుళ్ళు సైతం పాడైపోతున్నాయి. 2018లో మహేశ్వరం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మహేశ్వరం, మన్‌సాన్‌పల్లి, తుమ్మలూరు, సిరిగిరి పురం, గ్రామ పంచాయితిల్లో పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తామని ప్రకటించారు. ప్రజలకు టెలీమెడిసన్ ద్వారా వైద్య సేవలు ఈ కామర్స్, ఈ విద్య, ఆన్‌లైన్‌లో పౌర సేవలు మెరుగ్గా లభిస్తాయని చెప్పారు.తమ్ములూ పంచాయితీ డైరక్టగా జిల్లా కలెక్టర్, సీఎం మంత్రులకు తమ సమస్యలను విన్నవించే వ్యవస్థను అట్టహసంగా ప్రారంభించారు.

కానీ ప్రారంభించిన కొద్దికాలానికి సదరు సేవలు నిలిచిపోయాయి. కార్యాలయాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ టి ఫైబర్ ఏర్పాటు చేసిన పరికారాలు కనెక్షన్లు ఉన్నా పనిచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్‌లో భాగంగా రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ( ఒఎఫ్‌సి) ఏర్పాటును టీ ఫైబర్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌ను కార్పోరేషన్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా మూడు ప్యాకేజీలు పనుల్ని విభజించారు. వీటిని ప్రస్తుతం ఎల్‌ఎండ్‌టి, స్టెరిలైట్,టిసిఐఎల్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లతో పాటే కేబుల్ పనులు కూడా సాగుతున్నాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి 20 ఎంబిపిఎస్ సామర్థం కలిగిన ఇంటర్నెట్ పాఠశాలలు, కళాశాలలు, టెలీమెడిసిన్ వైద్యలకు 1 జిబిపిఎస్ సామర్ధం కలిగిన బ్రాండ్ బ్యాండ్ ప్రభుత్వం ప్రకటించింది.అయితే అధికారుల నిర్లక్షం కారణంగా కొన్ని గ్రామాల్లో కేబుల్ వేసినప్పటికి కనీస మౌలిక సుపాయాలు,రక్షణ వ్యవస్థలు ఏర్పాటు కాలేదు. కేబుల్ తెగినప్పటికి అంతరాయం లేకుండా చేపట్టిన రింగ్ కనెక్టివిటీ పనులు పూర్తి కాలేదు.ఈ ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులు పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో గ్రామాలు, మండలాల్లోని ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి ఇంటర్నెట్ సేవలు పొందుడంతో కొన్ని సందర్భాల్లో సేవల్లో జాప్యం కూడా నెలకొంటోంది. టి ఫైబర్ నెట్ వర్క్ పరిశీలనకు నానక్‌రామ్‌గూడలోని నెట్‌వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ( ఎన్‌వొసి) పనులు కొనసాగుతూనే ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 12751 గ్రామాల్లో పనులు చేపట్టగా ఇప్పటికీ సగబాగానికి పైగా గ్రామాల్లో సాంకేతిక సదుపాయలు సమకూర్చలేదు. మరి కొన్ని చోట్ల సదుపాయాలు పూర్తయిన బ్రాండెడ్ సేవలు ప్రారంభం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News