Saturday, December 21, 2024

ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం

- Advertisement -
- Advertisement -

దామెర: మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఒకే రోజు 35 లక్షల కుటుంబాలతో బిజెపి మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు కనీసం వంద కుటుంబాలను పలుకరించే విధంగా ఇంటింటికీ బిజెపి కార్యక్రమం మండలలోని కొగొల్వాయి గ్రామంలోని 77, 78 పోలింగ్ బూతుల్లో, ల్యాదెళ్ల గ్రామంలోని 84, 85 పోలింగ్ బూత్‌ల్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ల్యాదెళ్లలో 84, 85 పోలింగ్ బూత్ పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మందాటి శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు పిడుగు అనిల్‌యాదవ్, చుక్క మహేందర్, జంగిలి రాజేందర్, కోఆప్షన్ మెంబర్ పాలకుర్తి శ్రీలత, చిరంజీవి, మాందాటి ప్రశాంత్, కొలనుపాక సుధాకర్, అరుణ్‌కుమార్, సాంబరాజు, సుమంత్, విశ్వాంత్, శ్రీనివాస్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News