Friday, December 20, 2024

ఇంటింటికి టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

- Advertisement -
- Advertisement -

రాజోలి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలను ఆర్టీసీ విస్తరించబోతుంది. వడివడిగా అడుగులు వేస్తుంది. బుకింగ్ కౌంటర్ నుండి బుకింగ్ కౌంటర్‌కు మాత్రమే పార్సిళ్లు చేసిన ఆర్టీసీ, నేడు డోర్ డెలివరీలు చేస్తున్నారు. మండల కేంద్రమైన రాజోలిలో ఆదివారం బైసాని రాకేష్ టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమైంది. ఈ కార్గో సెంటర్‌ను ప్రారంభించడానికి జోగులాంబ గద్వాల జిల్లా బస్సు డిపో మేనేజర్ శ్రీనివాసులు , ట్రాఫిక్ సిఐ దామోదర్ గౌడ్‌లు రిబ్బన్ కట్ చేసి కార్గో సర్వీస్ సెంటర్‌ను ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రజల్లో ఉన్న నమ్మకమే సంస్థకు ఆదాయ వనరుగా మారింది. 2020 జూన్ 19వ తేదీన కార్గో సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలో 10వేల344 గ్రామాలు ఉండగా, 9వేల377 చోట్లకు ఆర్టీసీ బస్సులను తిప్పుతోంది. ఆభరోసాతోనే కార్గో సేవలు ప్రారంభించి 120 కోట్ల ఆదాయాన్ని అర్జించింది.

ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , మహారాష్ట్రలోని నగరాలకు కార్గో సేవలు అందిస్తోంది. వీలైనంత త్వరగా ఇంటి వద్దనే పికప్ డెలివరీ చేసే దిశగా పయనిస్తుందని అన్నారు. టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల బస్సు డిపో మేనేజర్ శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ దేవేందర్ గౌడ్, పృథ్వీరాజ్ , బైసాని రాధాకృష్ణ, స్వచ్ఛంద సేవకుడు మంగలి చిన్న రాజు, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News