Saturday, November 23, 2024

డోర్ టూ డోర్ కొవిడ్ వ్యాక్సినేషన్: సిఎం

- Advertisement -
- Advertisement -

Door to door vaccination by CM Kejriwal

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే డోర్ టూ డోర్ కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని సిఎం కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం 70 వార్డుల్లో జహాన్ ఓటు, వహన్ టీకా కార్యక్రమాన్ని సిఎం కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ఎక్కడ ఓటు ఉంటుందో ప్రజలకు అక్కడే టీకా వేస్తామన్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రతీ ఇంటికి బూత్ లెవెల్ అధికారి బృందం వెళ్లనుంది. ఢిల్లీలో ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్‌ను అధికారులు అందించనున్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించే వారిని బూత్ లెవెల్ అధికారి బృందం ఒప్పించనున్నారని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News